రాజ్యాంగ స్ఫూర్తితో మోడీ విధానాలపై కలిసి పోరాడుదాం 

Jan 26,2024 15:54 #Vizianagaram
farmers bike rally against bjp govt vzm

కార్మిక, కర్షక, రైతు సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాజ్యాంగం స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక,కర్షక రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన బైక్ ర్యాలీ నీ ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు ఎం.శ్రీనివాస జెండా ఊపి ప్రారంభించారు. విజయనగరం కలెక్టరేట్ దగ్గర ప్రారంభమైన బైక్ ర్యాలీ బాలాజీ మార్కెట్, ఎన్సిఎస్, కన్యక పరమేశ్వర కోవెల, ఎంజీ రోడ్డు, కోట, బాలాజీ జంక్షన్ మీదుగా కాంప్లెక్స్ దగ్గర ముగింపు జరిగింది. ఈ సందర్భంగా ఎం శ్రీనివాస మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు నుంచి రైతులు 1,50,000 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారని నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎరువులు పురుగు మందులు సబ్సిడీ ద్వారా అందించాలని ఎమ్మెస్ స్వామినాథన్ సిఫార్సులు ప్రకారం 50% పెట్టుబడి నిధి ఇవ్వాలని ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టడం ధ్వారా తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుంది. దేశంలో ప్రభుత్వం రంగ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్, రైల్వే, ఎల్ఐసి, టెలికం వంటి సంస్థలను ప్రైవేట్ కరణ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా మోసం చేసింది.దేశంలో నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడూ లేని విదంగా పెరిగిందన్నారు. రాజ్యాంగం ప్రమాణం చేసి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం దానిని పక్కనపెట్టి సెక్యులరిజన్ని దెబ్బతీస్తూ మెజార్టీ పేరు మీద పెద్ద ఎత్తున మతోన్మాదాన్ని పెంచే విధంగా పరిపాలన చేస్తుందన్నారు.
ప్రజాస్వామ్యం,లౌకికవాదం, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి మాటలను గౌరవించకుండా అభ్యుదయవాదుల పైన మేధావుల పైన ఉపా చట్టం ఉపయోగించి జైల్లో పెట్టి నిర్బంధిస్తుందన్నారు.. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ బైక్ ర్యాలీలో సిఐటియు ప్రధాన కార్యదర్శికే కె.సురేష్,జిల్లాఉపాధ్యక్షులు వి. లక్ష్మి, బి.సుధారాణి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ జగన్మోహన్,బి.రమణ, నగర ఉపాధ్యక్షులు ఆర్.శంకర్ రావు,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు,జిల్లా ఉపాధ్యక్షుడు ఆదినారాయణమూర్తి,సుజల పోరాట కమిటీ కన్వీనర్ సిహెచ్ జగన్,ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్,కౌలు రైతు సంఘం పైడుపునాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకోటి రాములు, రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేమురెడ్డి లక్ష్మి నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అమర్ భవన్ జిల్లా కార్యదర్శి డి అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం అమర్భవన్ జిల్లా కార్యదర్శ పురం అప్పారావు, రైతు నాయకులు పైడ్రాజు, బంగారు నాయుడు, నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️