వైఎస్ విజయమ్మ జాగ్రత్తగా ఉండాలి

Jan 28,2024 12:54 #Vizianagaram
jsp leader on ysp politics

రాజకీయాలు కోసం దేనికైనా వైసిపి నాయకులు ఒడికడతారు
పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం నాయకులు పాటించాలి
జనసేన నాయకులు గురాన అయ్యలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వైఎస్ విజయమ్మ జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైఎస్ వివేకానంద రెడ్డిని వాడుకున్నట్లు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం వైఎస్ విజయమ్మకు రక్షణ కల్పించాలని జనసేన నాయకులు గురాన అయ్యలు కోరారు. ఆదివారం స్థానిక జిఎస్ ఆర్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సభలో అన్నట్లు ఆయన అర్జునుడు కాదని దుర్యోధనుడు అని, దుర్యోధనుడు మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి పాలనా ఉందన్నారు. రాష్ట్రంలో, ఉత్తరాంధ్రలో అభివృద్ది ఏమి చేసారో చెప్పాలని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవన్నారు. అప్పు చేసి డబ్బును ధారాదత్తం చేయడం అభివృద్దా అని ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గెలవకముందు తండ్రి పేరు చెప్పిన ముఖ్యమంత్రి,ఇప్పుడు ఆయన పేరు లేకుండా ఈయన పేరు ప్రతి పథకానికి పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. నామినేటెడ్ పదవుల అర్హులకు ఎక్కడైనా ఇచ్చవా, సామాజిక న్యాయం అంటే రెడ్డిలకు పదవులు ఇవ్వడమా అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో బిసిలకు ఎందుకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక్కడున్న వైసీపీలో ఉన్న బిసి నాయకులకు సిగ్గు ఉండాలన్నారు. విజయనగరం నియోజకర్గ టికెట్ బిసిలకు ఇవ్వగలరా దమ్ముందా అని ప్రశ్నించారు. విద్య పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. గుంకలాం భూమి కొనుగోలులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నీ ఎమ్మెల్యే చేసిన ఘన కార్యం తెలుసుకోవాలని హితవు పలికారు. ఇతర మతాలను గుర్తించవు, శిలువ ఆకారంలో సభలో వేదిక ఏర్పాటు చేసి దానిపై నడిచిన నీకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రైతులకు ఏమి చేసావో దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయగలవా అని ప్రశ్నించారు. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం నేతలు పాటించాలని ఎటువంటి ప్రకటనలు సీట్లు విషయంలో చేయకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రాక్షక పాలన అంతమొందించేందుకు అందరం కలిసి గట్టిగా పని చేయాలని మిత్ర పక్షాలను కోరారు.

➡️