అత్యవసర సేవల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

Apr 15,2024 22:06

విజయనగరం : పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అత్యవసర సేవలందిస్తున్న శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల, ఎన్నికల విధులలో పాల్గొంటున్న పాస్‌లు పొందిన మీడియావారికి ఓటింగ్‌ కోసం పోస్టల్‌ బాలెట్‌ ను అందించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అత్యవసర సేవలను అందించే అధికారులతో కలెక్టర్‌ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ 33 శాఖల ను అత్యవసర శాఖలు గా గుర్తించి వారికి పోస్టల్‌ బాలెట్‌ ను ఇవ్వాలని నోటిపై చేసినట్లు తెలిపారు. వీరు పోస్టల్‌ బాలెట్‌ కోసం ఫారం -డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు అధారిటీ అఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పోరేషన్‌ అఫ్‌ ఇండియా, ఇండియన్‌ రైల్వే , ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో , దూరదర్శన్‌ , ఆలిండియా రేడియో , ఎలక్ట్రిసిటీ , హెల్త్‌ అండ్‌ ఫామిలీ వెల్ఫేర్‌ , స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ , ఫుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లయి, బిఎస్‌ఎన్‌ఎల్‌, పోలింగ్‌ రోజున ప్రెస్‌ కవరేజ్‌ చేయడానికి ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన అధారిటీ లెటర్స్‌ కలిగి ఉన్న పాత్రికేయులు , ఫైర్‌ సేవలు అందిస్తున్న వారికి వర్తిస్తుందని తెలిపారు. ఆయా శాఖల అధికారులు పోస్టల్‌ బాలెట్‌ కోసం సిబ్బంది వివరాలను మంగళవారంలోగా అందజేయాలని తెలిపారు. మే 8,9,10 తేదీలలో ఓటు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఒక సారి ఫారం డి తీసుకున్న వారికీ పోస్టల్‌ బాలెట్‌ ద్వారా తప్ప పోలింగ్‌ స్టేషన్‌ లో ఓటు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేసారు. సమావేశం లో జాయింట కలెక్టర్‌ కార్తీక్‌ , డిఆర్‌ఒ అనిత, అత్యవసర శాఖల అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గాలకు ఇవిఎంల తరలింపు నెల్లిమర్ల : స్థానిక ఇవిఎం గోదాము నుంచి నియోజకవర్గ కేంద్రాలకు ఇవిఎంల తరలింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి సోమవారం తనిఖీ చేసారు. ర్యాండమైజేషన్‌ ద్వారా ఇవిఎంలను నియోజక వర్గాలకు కేటాయించిన విషయం తెలిసిందే. సీరియల్‌ నంబర్ల ప్రకారం, వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరుచేచేసి స్ట్రాంగ్‌ రూమ్‌ లకు తరలించారు. ఇవిఎంల నోడల్‌ ఆఫీసర్‌ బి.ఉమాశంకర్‌, డిఆర్‌డిఎ పీడీ ఎ.కళ్యాణచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️