ఇన్స్పైర్ సైన్స్ ప్రాజెక్ట్ ల ప్రదర్శన

Feb 12,2024 12:32 #Vizianagaram
Presentation of Inspire Science Projects

విజయవంతం చేయండి : డీ ఈ ఓ ఎన్.ప్రేమ కుమార్ 
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే ఇన్స్పైర్ ప్రాజెక్టుల జిల్లా స్థాయి ప్రదర్శన తోడ్పడుతుందని ఈనెల 15వ తేదీన శ్రీ చలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ , పూల్బాగ్,విజయనగరం నందు నిర్వహించనున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మూడేళ్ల తర్వాత ప్రత్యక్షంగా ఇన్స్పైర్ ప్రదర్శన జరగడం ఇది ప్రధమం కనుక జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల నుంచి 2022- 2023 సంవత్సరంలలో మంజూరు కాబడిన ప్రాజెక్టులను జిల్లా స్థాయి ప్రదర్శనకు తీసుకురావాలి అని తెలిపారు. ఒక విద్యార్థి ఒక గైడ్ టీచర్ ఒక ప్రాజెక్టుకు ఆయా పాఠశాలల నుంచి హాజరు కావలసి ఉంది.ఉమ్మడి విజయనగరం జిల్లా వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 180 ప్రాజెక్టులు పాల్గొననున్నాయన్నారు. ఈ కార్యక్రమం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది అని జిల్లా సైన్స్ అధికారి ఎం కృష్ణారావు సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.

➡️