మోకాళ్ళపై సంకెళ్లతో అంగన్వాడీల నిరసన 

Jan 22,2024 15:05 #Vizianagaram
anganawadi arrest chalo vijayawada

అరెస్టులపై తీవ్రంగా ద్వజమెత్తిన కార్మిక, విద్యార్థి, మహిళ సంఘాలు.

ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరిక.

తొలగింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ కి విజ్ఞప్తి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీల సమస్యలపై కోటి సంతకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకునేందుకు ఆదివారం విజయవాడ బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించడానికి ఖండిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద సి ఐ టి యు, ఇఫ్టు, ఎస్ ఎఫ్ ఐ, ఐద్వా ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేతులకు సంకెళ్లతో మోకాళ్లపై నిల్చోని నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా కార్మిక ,ప్రజా సంఘాల నాయకులు రెడ్డి శంకర్రావు, జగన్మోహన్, రామ్మోహన్, రమణమ్మ, రమణ, సుధారాణి, అప్పలసూరి మాట్లాడుతూ మొన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 1025 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు, నేడు ప్రధానమంత్రి అయోధ్యలో రాముని విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు. భూదేవి లాంటి సహనంతో 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడి మహిళలల్ని మాత్రం అత్యంత దుర్మార్గంగా విజయవాడ వెళ్ళనివ్వకుండా నిర్బంధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ 9 గంటల లోపు విధులకు హాజరు కాకపోతే తొలగిస్తున్నామని ప్రకటించడం దుర్మార్గమని, వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈరోజు సాయంత్రం లోపు స్పందించి సానుకూలంగా సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయకపోతే కార్మిక, ప్రజా, విద్యార్థి, మహిళ, ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకొని రాష్ట్రాన్ని ద్రిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద చేతులకు సంకెళ్లు వేసుకుని మోకాళ్లపై నిల్చోని అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుల హరీష్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు .

➡️