సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె

Dec 20,2023 16:49 #Vizianagaram
samagra siksha employees strike vzm

రెగ్యులరైజ్ చెయ్యాలి, హెచ్.ఆర్ పాలసీ, సమాన పనికి సమానవేతనం అమలు చేయాలని జె ఏ సి డిమాండ్
కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బుధవారం నుంచి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జె ఏ సి అధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు.బుధవారం నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్ష ను ఉద్దేశించి కె.గురువులు, సి అర్ పీ ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్, డేటా ఎంట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,ఉమా శంకర్, ఎం ఇ ఎస్ కో ఆర్డినేటర్ లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,రవీంద్రబాబు, పార్ట్ టైం అధ్యాపకులు జిల్లా అధ్యక్షులు, రామకృష్ణ, మండల అకౌంటెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, గణేష్, మెసెంజర్ అసోసియేషన్ అధ్యక్షులు, రాంబాబు, డి పి ఓ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశిపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పిఆర్సి అమలు చేయకుండా, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ పై జీఓలు మీద జీవోలు ఇచ్చి, అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల మధ్య విబేధాలు, విభజన సృష్టించే విధానాలు అమలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సంప్రదాయాన్ని గాలికి వదిలేసి,ప్రాజెక్టులో ఒకే క్యాడర్ ఉద్యోగులకు రకరకాల వేతనాలు చెల్లిస్తూ, కొత్త విధానాలకు తెరలేపారన్నారు. పాత వారికి జీతం పెంచకుండా, కొత్తగా నియమితమైన వారికి జీతం పంచే సాంప్రదాయాన్ని ప్రారంభించారన్నారు. పార్ట్ టైం పేరుతో తక్కువ జీతాలు ఇచ్చే విధానాలను అమలు చేస్తున్నారు. కొన్ని విభాగాలకు, కెజిబివి టీచర్స్ లకు అరకొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారు, ఎన్నికల కంటే ముందు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, అన్ని విధాలుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి, ఒక్క సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, అందరిని రెగ్యులర్, సమాన పనికి సమాన వేతనం ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. పెరిగిన నిత్యవసర, రవాణా, పెట్రోల్ ధరలతో కుటుంబాలతో సాగలేక చనిపోతున్న ఉద్యోగ కుటుంబాలను పరామర్శ చేయడానికి కూడా అధికారులు, ప్రభుత్వ పెద్దలు వెళ్లడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడితో పని ప్రదేశాల్లోనే చనిపోతున్న, ప్రభుత్వం నుండి చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ ఉద్యోగులకు, సంక్షేమ పథకాలు కట్ చేసి, జీతాలు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా నరకయాతన పెడుతున్నారన్నారు.
మేము అధికారంలోనికి వస్తే అన్ని పరిష్కరిస్తామని చెప్పి, ఏమి చేయకుండా ఉన్నారు. సమగ్రశిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్టెం ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చెయ్యాలని, హెచ్. ఆర్పాలసీ అమలు చెయ్యాలని ఈ సందర్భంగా జెఎసి డిమాండ్ చేస్తుందన్నారు. సమగ్ర శిక్షా పరిదిలో పనిచేస్తున్న మండల విద్యాశాఖా కార్యాలయం లో పనిచేస్తున్న సి. ఆర్.ఎం.టి లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్. ఎం.ఐ. ఎస్ కోర్డినేటర్స్, మండల లెవెల్ అకౌంటెంట్స్, మెసెంజర్స్, సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్, భవిత ఆయ, ఫిజియోతెరపిస్టులు. హై స్కూల్స్ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో పనిచేస్తున ఆర్ట్, క్రాఫ్ట్, పి.ఈ.టి పార్ట్ టైం టీచర్స్, జిల్లాల కార్యాలయం లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మెసెంజర్స్, సిస్టం అనాలిసిస్టూ, కాంట్రాక్టు అసిస్టెంట్ సేక్టోరియాల్స్, సైట్ ఇంజినీయర్స్, కస్తూరిభా స్కూల్స్ లో పనిచేస్తున్న సిబ్బంది ప్రిన్సిపాల్స్, టీచర్స్, పి.ఈ. టిలు, కాలేజీలో పనిచేస్తున్న పి.జి. టిలు, కంప్యూటర్, ఒకేషనల్ పార్ట్ టైం టీచర్స్, అకౌంటెంట్స్,, అటెండర్స్, వంట మనుషులు, సీపర్స్, డే అండ్ నైట్ వాచ్-విమెన్స్, స్కావెంజర్, ఉర్దూ, అరబిక్ టీచర్స క్రింది సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.
సమగ్ర శిక్షా లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని,  సమగ్ర శిక్షా ఉద్యోగులకు అందరికి హెచ్.ఆర్ పాలసీ అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అందరికి మినియం ఆఫ్ టైం స్కేల్ + హెచ్ ఆర్ ఎ+డి ఎ అమలు చేసి, వేతనాలు పెంచాలని, ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి, ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని,ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోని మార్చి మినియం ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి, వేతనాలు పెంచాలని, 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యుడి కల్పించాలి. సామజిక భద్రత పధకాలు పిఎఫ్, ఈ ఎస్ ఐ అమలు చేయాలనీ,
పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి, మెరుగైన హెల్త్ స్కీం అమలు చేయాలని,
సి.ఆర్.ఎం.టి లు (సి ఆర్ పి ఎస్), డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎం.ఐ. ఎస్ కోర్డినేటర్స్, మండల లెవెల్ అకౌంటెంట్స్, మెసెంజర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, పి.ఈ.టి, కేజీబీవీ స్కూల్స్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్, ఖాళి పోస్టులను భర్తీ చేయాలని, పని భారం తగ్గించాలి, అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేజీబీవి స్కూల్స్ డైలీ వైజ్, ఏం.ఈ.ఓ లలో టెంపరరీ లేదా స్టాఫ్ గ్యాప్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్దతిలోనికి తీసుకోవాలని,అన్ని సంక్షేమపధకాలు అమలు చేయాలి, వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వాలనీ, ఎక్స్రేషియా 20 లక్షలకు పెంచాలి, పెండింగ్ ఎక్స్ గ్రేషియాలను వెంటనే చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి, కారుణ్య నియమాలు చేపట్టాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజరు చేయాలని,  ప్రతినెల 1వ తేదికి వేతనాలు చెల్లించాలి, సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమగ్రశిక్షా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జెఏసి) నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️