గ్రామదేవత పండుగలకు ప్రత్యేక ఏర్పాట్లు

May 18,2024 15:03 #Vizianagaram

మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి

ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలోని నేటి నుంచి గొల్లపల్లి శ్రీదాడితల్లి, పాతబొబ్బిలి శ్రీసరేపొలమ్మతల్లి గ్రామ దేవతలు పండుగల సందర్భంగా పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి చెప్పారు. గ్రామదేవత పండుగల సందర్భంగా ఆమె ప్రజాశక్తితో మాట్లాడారు.

ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

గ్రామ దేవత పండుగల సందర్భంగా ప్రజలు, భక్తులు ఇబ్బందులు పడకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. మున్సిపాలిటీలో అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి కాలువలు శుభ్రం చేస్తున్నామని చెప్పారు. సిరిమానోత్సవం సందర్భంగా దాడితల్లి, సరేపొలమ్మతల్లి సిరిమానోత్సవం వెనుక రెండు పారిశుద్ధ్య కార్మికులతో టీములు ఏర్పాటు చేసి సిరిమాను వెనుక వెళ్లి పారిశుద్ధ్య పనులు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రెండు ట్యాంకర్లతో తాగునీరు సరఫరా

ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుళాయిలతో రెగ్యులర్ గా తాగునీరు సరఫరా చేసి రెండు మంచినీటి ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. పాతబొబ్బిలి ప్రజలకు ఒక ట్యాంకర్, గొల్లపల్లి ప్రజలకు మరో ట్యాంకర్ తో తాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు.

సిరిమానోత్సవం విజయవంతానికి చర్యలు

రెండు సిరిమానోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీదాడితల్లి, శ్రీసరేపొలమ్మతల్లి సిరిమానోత్సవం జరిగే రోడ్లుపై ఉన్న గోతులను పూడ్చుతున్నామని చెప్పారు. కాలువలపై ఆక్రమణలు తొలగిస్తామన్నారు. రోడ్లుపై నిర్మాణ సామగ్రి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిరిమానోత్సవంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చలు జరిపినట్లు చెప్పారు.

రెండు కంట్రోల్ రూములు ఏర్పాటు

పాతబొబ్బిలి శ్రీసరే పొలమ్మతల్లి ఆలయం, గొల్లపల్లి శ్రీదాడితల్లి ఆలయాలు వద్ద రెండు కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై కంట్రోల్ రూములో పిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు గ్రామదేవత పండుగలు విజయవంతం చేసేందుకు ప్రజలు, భక్తులు సహకరించాలని కోరారు

➡️