అక్రమ అరెస్టులకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ధర్నా

Jan 5,2024 17:56 #Vizianagaram
ssa employees strike arrest vijayawada vzm

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శుక్రవారం చలో విజవాడకు తరలి వెళ్ళిన సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ జె ఏ సి నాయకులు అన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి నాయకులు కె.త్రినాధరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని 17 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని చలో విజయవాడకు వెళ్తే పోలీసులు అన్యాయంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️