సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి

Mar 4,2024 17:17 #Vizianagaram
Technical knowledge should be provided

 రిజిష్టర్ జయసుమ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రెండు రోజులు పాటు జె ఎన్ టి యు లో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ సదస్సును యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.జయసుమ సోమవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో వస్తున్న మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరికరాలు అవి పని చేస్తున్న తీరును పరిశీలించడం ద్వారా మనలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. ఇటువంటి సదస్సులు జరగడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని అధి మన చదువుకు ఎంతో దోహద పడుతుందన్నారు. అనంతరం మరో అతిధిలు జి.సతీష్,ప్రేమ్ కుమార్ లు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యత గురుంచి వివరించారు. సదస్సులో విద్యార్దులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️