సమ్మెపై మొండి వైఖరి మానుకోవాలి

Dec 16,2023 16:32 #Vizianagaram
vzm anganwadi strike 5th day a

ప్రజాశక్తి-రాజాం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మెపై మొండి వైఖరి మానుకొని, తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాంలో 5వ రోజు నల్ల రీబ్బనాలతో మోకాళ్లపై జరిగిన నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాoలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె లక్ష మంది చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, దీని మూలంగా గర్భిణీలు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, సమ్మెకు ముందు సమ్మె తర్వాత రాష్ట్ర మంత్రివర్గ కమిటీ , అధికారులు యూనియన్ తో చెట్లు జరిగి ఎటువంటి పరిష్కారం చూపడం సరైన పద్ధతి కాదని, చర్చల పేరుతో కాలయాపన చేయడం ఏ రకమైనటువంటి వైఖరు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని, జీతాల పెంపు ,గ్రాటివిటీ ,పెన్షన్ వంటి ప్రధాన సమస్యల పరిష్కారం చేయకుండా ఇతర అంశాలపై చర్చించి చర్చల పేరుతో సాధారణ ప్రజానీకాన్ని అంగన్వాడిని తప్పుతావు పట్టించే ప్రయత్నం మానుకోవాలని తీవ్రంగా విమర్శించారు, జీతాల పెంపు గ్రావిటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని అడిగితే ఆర్థిక కారణాలు చెప్పడం ఇది ఏ రకమైనటువంటి పద్ధతిని ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని మరి ఏ రకంగా చెప్పారని ప్రశ్నించారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.

1. అంగన్వాడీలను తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి.
2. రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి అమలు చెయ్యాలి.
3. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి.
4. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.
5. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సం॥లకు పెంచాలి. రాజకీయ జోక్యం అరికట్టాలి
6. ఎఫ్.ఆర్.ఎస్ రద్దు చేయాలి. అన్ని యాప్లు కలపి ఒకే యాప్ మార్చాలి.
7. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, భీమా అమలుచెయ్యాలి. పెండింగ్లో ఉన్న సెంటర్అద్దెలు, 2017 టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి.
8. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. రిటైర్మెంట్ వయస్సు 62 సం॥లకు పెంచాలి. సంక్షేమ పధకాలు అమలు చెయ్యాలి.
9. లబ్దిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి. ప్రీ స్కూల్ బలోపేతం చెయ్యాలి. ఈ కార్యక్రమంలో బి ఉమాకుమారి, కాళీ రత్నం, వనజ, సత్యవతి, సుశీల, దమయంతి, ధవళేశ్వరీ, శ్రీదేవి, లక్ష్మి, అనురాధ, రాంబాయి, వరలక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు.

➡️