ఓటు వేయాలంటే నది దాటాల్సిందే

May 13,2024 23:13

కొమరాడ : మండలంలోని నాగావళి నది ఆవల ఉన్న పలు పంచాయతీల ప్రజలు ఓట్లు వేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని తొమ్మిది పంచాయతీలు నది ఆవల ఉన్నప్పటికీ ఆయా గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. మండలంలోని చోళ ్లపదం పంచాయతీకి చెందిన రెబ్బ, వనధర గ్రామాలు నాగావళి నది ఆవల ఉన్నాయి. ఆ రెండు గ్రామాలకు సంబంధించి సాధారణ ఎన్నికల్లో భాగంగా నది ఇవతల వైపు ఉన్న కూనేరులో పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేశారు. దీంతో ఓటు వేసేందుకు నది దాటాల్సిన పరిస్థితి గిరిజనులకు తప్ప లేదు. పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి కాకపోవడంతో నదిలో నడుచుకుంటూ ప్రమాదకర పరిస్థితిలో తమ ఓటు హక్కును గిరిజనులు వినియోగించుకున్నారు. ఓటు వేసిన ప్రతిసారీ ఈసారైనా తమ వంతెన పూర్తవుతుందని, రాకపోకలకు ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో అష్ట కష్టాలు పడి యువతీ యువకులు, వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు నది దాటుకొని వస్తున్నారు. ఈసారైనా కురుపాం ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేసి తమ కష్టాలను తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

➡️