గ్రామాభివృద్ధే థ్యేయం : గొట్టిపాటి

ప్రజాశక్తి-దర్శి : గ్రామాభివృద్ధే టిడిపి థ్యేయమని ఆ పార్టీ దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. తాళ్లూరు మండలం రాజా నగరం పంచాయతీ పరిధిలోని మల్కాపురం, రాజానగరంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని తెలిపారు. వైసిపి ఐదేళ్ల పాలనలో గ్రామాభివృద్ధి జరగ లేదన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగు తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామ స్తులు గొట్టిపాటి లక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ లలిత సాగర్‌, టిడిపి మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, కొండారెడ్డి, రమేష్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.టిడిపిలో చేరిక ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు మేదరమెట్ల కొండలరావు ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరారు. డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, లలిత సాగర్‌ వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. టిడిపిలో చేరిన వారిలో గండి సుందర్‌రావు, జాన్‌, కోటయ్య, బెంజిమెన్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు శ్రీనివాసరావు, న్యాయవాది రంగా, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️