రాష్ట్ర సీనియర్‌ ఖో ఖో పోటీలలో విజయనగరం విజేతలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర సీనియర్‌ ఖో ఖో పోటీల్లో గెలుపొందినవారిని మంగళవారం ఉదయం నిర్వాహకులు అభినందించారు. ఈనెల 23 నుండి 25 వరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జరిగిన సీనియర్‌ అంతర్‌ జిల్లాల ఖో ఖో పోటీలలో విజయనగరం జిల్లా పురుషుల జట్టు ద్వితీయ స్థానం, స్త్రీల జట్టు తృతీయ స్థానం సాధించడం జరిగింది. ఈ విజయం పట్ల అధ్యక్షురాలు పెనుమజ్జి విజయలక్ష్మి, కార్యదర్శి సత్యనారాయణ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గోపాల్‌ ట్రెజరర్‌ మల్లికార్జున్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ జట్టుకు మేనేజర్‌ గా సత్య ప్రసాద్‌ వ్యవహరించారు ఈ విజయం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు

➡️