సంక్షేమానికి ఓటు వేయండి : బొత్స

May 6,2024 21:32

ప్రజాశక్తి- గజపతినగరం : గత ఐదేళ్లలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేశామని, వాటిని చూసి వైసిపిని గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య అన్నారు. సోమవారం సాయంత్రం పురిటిపెంటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ అంటూ అబద్ధపు హామీలతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబునాయుడు సిద్ధం అయ్యాడని, పుట్టుకపోతే వచ్చిన బుద్ధులు పిడకల్తో పోతాయంటూ సెటైర్‌ వేశారు. మామకు వెన్నుపోటుతో మొదలైన మోసాలు అధికారం లోకి వచ్చాక యువతను, వృద్ధులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేస్తూనే ఉన్నాడని అన్నారు. వైసిపి హయాంలో కరోనా సమయం లో కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు గార తవుడు, మాజీ సర్పంచ్‌ మండల సురేష్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, గొర్లె సత్యం అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️