ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి : సిఐ సోమశేఖర్‌

Apr 8,2024 13:43 #CI, #press meet, #Voting rights

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : ఓటు హక్కును ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రెండవ పట్టణ సీఏ సోమశేఖర్‌ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు చీరాల సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారి బేతపూడి ప్రసాద్‌ ఉత్తర్వులు ప్రకారం …. జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయన ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది, బిఎస్‌ఎఫ్‌ సిబ్బందితో చీరాల టూ టౌన్‌ పరిధిలో రామ్‌నగర్‌, ఆదినారాయణపురం, న్యూ కాలనీలలో రూట్‌ మార్చ్‌ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ కవాతు ఐఎల్‌ టి డి నుండి ప్రారంభమించారు. సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. అదే విధంగా ఆ ప్రాంత పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్‌ కూడా వారి ఇంటి వద్దనే కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జరగబోవు ఎన్నికల వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగించినవారి వివరాలు వెంటనే పోలీసలకు సమాచారం అందించి సహకరించాలి అన్నారు.

➡️