మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాష్ట్రంలో మరోమారు వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా యర్రగొండ పాలెం లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జూమ్‌ మీటింగ్‌లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ నాయకులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సందేశాన్ని విన్నారు. అనంతరం తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీకి ఎగ్జిట్‌ పోల్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు. తిరిగి జగన్మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారని తెలిపారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం పెరగడంతో పాటు సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందన్నారు. యర్రగొండపాలెంలో కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్‌, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, సింగా ప్రసాద్‌, గంజి శ్రీనివాసరెడ్డి, వాగ్యా నాయక్‌, బాబులు నాయక్‌, ముసలారెడ్డి, ప్రసాద్‌, జబివుల్లా, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️