ముక్కాంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

Apr 30,2024 21:38

ప్రజాశక్తి – భోగాపురం : ముక్కాం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని వైసిపి ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని ముక్కాంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారులు మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా తనను, ఎమ్‌పిగా చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. వైసిపి మండల కన్వీనర్‌ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలిచారని అటువంటి నాయకుడిని మళ్లీ గెలిపించుకొని మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రెయ్యడు, వైస్‌ ఎంపిపి రావాడ బాబు, పడాల శ్రీనివాసరావు, సుందర హరీస్‌, కర్రోతు వెంకటరమణ, పతివాడ రామకృష్ణ, భోగరాజు పాల్గొన్నారు.డెంకాడ: మండలంలోని బొడ్డవలస గ్రామంలో ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు, ఎమ్మెల్యే తనయుడు మణిదీప్‌నాయుడు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును, ఎమ్‌పి బెల్లా చంద్రశేఖర్‌ను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️