అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి తీరుతాం

పల్నాడు జిల్లా: గౌరవ వేతనం తీసుకునే అంగన్వాడీ కార్యకర్తలు సమాజానికి చేసే సేవ అనిర్వచనీయమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేటలోని భువన చంద్ర టౌన్‌ హాల్లో సోమ వారం అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే, ఆయన కుమార్తె డాక్టర్‌ అమూల్య ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షు రాలు కెపి మెటిల్డాదేవి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారిల ఆధ్వర్యంలో వారికి అంగన్వాడీలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అరవిందబాబు మాట్లాడుతూ ప్రజల కోసం నిత్యం పని చేసే అంగన్వాడీలను ఆదుకునే బాధ్యత తాను తీసు కుంటానని చెప్పారు.గతంలో వేత నాలు పెంచాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు కోరితే కనీసం వారి వినతిని పట్టించుకోకపోగా లాఠీలతో కొట్టించిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని విమర్శిం చారు. కనీసం పోరాటం చేయడానికి కూడా వీల్లేకుండా వారిని అణచి వేసేందుకు ప్రయత్నించారన్నారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితి కూడా మారిందని,ప్రతి ఒక్కరిక న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామన్నారు. అంగన్వాడీల వేతనాల పెంపు సహా అన్ని డిమాండ్లను పరిష్కరించేలా ముఖ్యమంత్రి చంద్ర బాబును ఒప్పిస్తామన్నారు. జగన్‌ ప్రభుత్వం పంచా యతిల నిధులను కూడా దారి మళ్లించి వ్యవస్థలను నిర్వీ ర్యం చేసిందని, రాష్ట్రాన్ని ఆర్ధికంగా చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, ఆర్థ్ధికంగా దుర్బరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా మన్నారు. విద్య,వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి పారదర్శకమైన పాలన అందించే బాధ్యత తీసుకుంటా మన్నారు. డాక్టర్‌ అమూల్య మాట్లాడుతూ కనీస వేతనాల కోసం అంగన్వాడీలు చేసిన పోరాటానికి త్వరలోనే న్యాయం చేసి తీరుతామన్నారు.అంగన్వాడీలు సహా ప్రతి చిరుద్యోగి సమస్యకు ముఖ్యమంత్రి పరిష్కారం చూపిస్తా రన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు తోడుగా ఉంటామన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా,ఏ క్షణంలో అయినా ఇంటికి వచ్చి అయినా సమస్య చెప్పుకోవచ్చనన్నారు. నిరంకుశ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన వచ్చిందని,ఇక్కడ ప్రజల అభీష్టం మేరకే పాలకులు నడుచుకుంటారని అన్నారు. అనంతరం అరవింద బాబును, అమూల్యలను యూనియన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

➡️