సంపద సృష్టి చంద్రబాబుతోనే సాధ్యం: మన్నె

ప్రజాశక్తి-పెద్దదోర్నాల అప్పులతో కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని, సంపద సృష్టి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్నె రవీంద్ర అన్నారు. ఆదివారం ఆయన పెద్దదోర్నాల పట్టణంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కుమారుడు గూడూరి అజిత్‌, కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియాతో పాటు స్థానిక నాయకు లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నె రవీంద్ర మాట్లాడుతూ గత అయిదేళ్లలో జగన్‌ విధ్వంస పాలన కారణంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళిక చంద్రబాబు వద్ద ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్‌బాబు, ఎంపి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎరిక్షన్‌బాబు కుమారుడు అజిత్‌, కుమార్తె చెల్సియా కూడా ఇంటింటికీ ప్రజలతో మమేకమయ్యారు. మండుటెండలోనూ వారి ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ ఏరువ మల్లికార్జున రెడ్డి, టిడిపి నాయకులు సుధాకర్‌రెడ్డి, సుబ్బ రత్నం, షేక్‌ మాబు, నాగేంద్రబాబు, గోపాల్‌, శ్రీనివాస యాదవ్‌, బాషా పాల్గొన్నారు.

➡️