టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ‘పల్లా’కు ఘనస్వాగతం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పల్లా శ్రీనివాసరావు

 

ప్రజాశక్తి -గాజువాక: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తర్వాత గాజువాక నియోజవర్గానికి సోమవారం రాత్రి విచ్చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఘనస్వాగతం లభించింది. సాయంత్రం ఆరుగంటలకు విశాఖ విమానాశ్రయంలో దిగిన పల్లాకు గాజువాకతోపాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలివ చ్చిన టిడిపి, కూటమి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ పూలదండలతో విశాఖ విమానాశ్రయంలో స్వాగతించి, సత్కరించారు. అక్కడి నుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో గాజువాక వరకు వచ్చిన పల్లాకు దారిపొడుగునా ఎయిర్‌పోర్ట్‌ నుంచి షీలా నగర్‌, అక్కిరెడ్డిపాలెం, బిహెచ్‌పివి, ఆటోనగర్‌, పాత గాజువాక జంక్షన్‌ వరకు ప్రతిజంక్షన్లోనూ అభిమానులు, నాయకులు బారులుదీరి నినాదాలు చేస్తూ ఘనంగా స్వాగతించారు. మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు.భారీ ఎత్తున పల్లాకు స్వాగతించేందుకు వచ్చిన కూటమి శ్రేణులు, అభిమానులు, ప్రజలను నియంత్రించడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. యువకుల, అభిమానులు, టిడిపి శ్రేణులు పల్లాతో కరచాలనానికి ఎగబడ్డారు. తర్వాత వాత గాజువాకలోని కుంచుమాంబ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. పల్లాను కలిసేందుకు, స్వాగతించేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులతో గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిలబడడానికి కూడా స్థలం లేనంతగా కిక్కిరిసిపోయింది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పల్లా శ్రీనివాసరావు

➡️