పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత

Apr 17,2024 22:14

ప్రజాశక్తి-పార్వతీపురం: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. పార్వతీపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కి సమీపంలో జిల్లా పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నూతన హంగులతో నిర్మించిన క్యాంపు ఆఫీస్‌, వ్యాయామశాల భవనాన్ని బుధవారం ఎస్‌పి ప్రారంభించారు. ముందుగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు లు నిత్యం విధులతో ఒత్తిడికి గురవుతారని తెలిపారు. శారీర కంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరనే ఉద్దేశంతో అన్నివసతులతో కూడిన వ్యాయామశాలను నిర్మించామన్నారు. రానున్న రోజుల్లో సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పిలు ఒ.దిలీప్‌ కిరణ్‌, సునీల్‌ షరోన్‌, డిఎస్‌పిలు ఎస్‌.ఆర్‌.హర్షిత, వెంకట అప్పారావు, ట్రెయినీ డిఎస్‌పి అజీజ్‌, ఎఆర్‌ ఆర్‌ఐలు శ్రీరాము లు, శ్రీనివాసరావు, సిఐలు సిహెచ్‌.లక్ష్మణరావు, కృష్ణారావు, రవికుమార్‌, ఎస్‌ఐలు దినకర్‌, సంతోషి పాల్గొన్నారు.

➡️