సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ప్రజాశక్తి-కొండపి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. వైసిపి కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మంచి విద్యావేత్త అని పేర్కొన్నారు. స్థానిక మద్దులూరు రోడ్డులోని వైసిపి కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన ఆదిమూలపు సురేష్‌ నామినేషన్‌ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారని తెలిపారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కొండపిలో వైసిపి జెండా ఎగరవేసి జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ ఆరికట్ల కోటిలింగయ్య, నాయకులు బొక్కిసం సుబ్బారావు, వైసిపి నాయకులు,పాల్గొన్నారు.

➡️