ఆకర్షణీయంగా ప్రజాశక్తి 2024 క్యాలెండర్‌

Dec 22,2023 18:55

కాళ్లకూరు సొసైటీ ఛైర్మన్‌ సురేష్‌
ప్రజాశక్తి – కాళ్ల
ప్రజాశక్తి 2024 క్యాలెండర్‌ వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉందని కాళ్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌ మాధు సురేష్‌ అన్నారు. మండలంలోని కాళ్లకూరు సొసైటీలో ప్రజాశక్తి దినపత్రిక 2024 క్యాలెండర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్‌ పత్రికలకు పోటీగా ప్రజాశక్తి పత్రిక నిలుస్తూ కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన బడుగు బలహీన మైనార్టీల ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సిఇఒ యిబ్బా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజాశక్తి దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజాశక్తి దినపత్రిక ప్రజల మన్ననలు పొందుతుందని ప్రజాశక్తి ఎడివిటి జిల్లా ఇన్‌ఛార్జి పి.నారాయణరాజు అన్నారు. సొసైటీ ఛైర్మన్‌ మాధు సురేష్‌, సిఇఒ యిబ్బా శ్రీనివాస్‌, త్రి సభ్య కమిటీ సభ్యులు అంగర సద్గుణరావు (యేసుబాబు), పచ్చిగోళ్ల సవితవెంకట రమణరావు, ఎడివిటి జిల్లా ఇన్‌ఛార్జి నారాయణరాజు, డివిజనల్‌ ఇన్‌ఛార్జి గుండా సాయికుమార్‌ చేతులమీదగా ప్రజాశక్తి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కాళ్ల మండలం నుంచి రూ.3.61 లక్షల యాడ్స్‌ సేకరించి సింగిల్‌ క్యాలెండర్‌ తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది పి.రామకృష్ణంరాజు, వేగేశ్న ప్రకాష్‌వర్మ, వేగేశ్న సత్యనారాయణరాజు, సిహెచ్‌వి.రామకృష్ణ, ఎస్‌.త్రిమూర్తులు, జి.అప్పారావు, సిహెచ్‌.నాగప్రసాద్‌, యు.శ్రీనివాసరావు, జె.లక్ష్మి, కాళ్ల మండల ప్రజాశక్తి విలేకరి గొట్టేటి శ్రీనివాసులు, భీమవరం సర్క్యులేషన్‌ ఇన్‌ఛార్జి టి.పెద్దిరాజు పాల్గొన్నారు.

➡️