చిన్నారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల

ప్రజాశక్తి – పాలకొల్లు

పాలకొల్లు పట్టణ 18వ వార్డుకు చెందిన 13 నెలల పాప వైద్యం విషయంలో ఇచ్చిన మాటను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలబెట్టుకున్నారు. విజయవాడలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరిన చిన్నారి అక్షరను చూసేందుకు బుధవారం స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ పాప సర్జరీకి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. వార్డులోకి వెళ్లి ఆ చిన్నారిని చూసి ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదని, అంతా తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

➡️