ఉద్యమవీరులకు మరణంలేదు

గణపవరం:ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారానికి వేగుచుక్క ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ అని, ఉద్యమవీరులకు మరణం లేదని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి అన్నారు. శుక్రవారం పిప్పర జిల్లా పరిషత్‌ హైస్కూల్లో యుటిఎఫ్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాబ్జీ సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. సభకు మండల కమిటీ అధ్యక్షులు జె.నాని అధ్యక్షత వహించారు. గోపీమూర్తి మాట్లాడుతూ సాబ్జీ మరణంతో ఉద్యమాల గొంతుమూగబోయిందన్నారు. ఆయన ఆశయ సాధనకు యుటిఎఫ్‌ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎంఇఒ పుచ్చల శేషు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా నాయకులు వి.ఆంజ నేయులు, మండల ప్రధాన కార్యదర్శి జి.భవానీప్రసాద్‌, మండల నాయకులు ఎం.పెద్దిరాజు. కె.హరిదుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. తొలుత సాబ్జీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

➡️