ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచండి

టిడిపి మండల కమిటీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు

ప్రజాశక్తి – గణపవరం

మండలంలోని పిప్పర ప్రాథమిక ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలతో అధ్వానంగా తయారవడంతో మంగళవారం టిడిపి మండల కమిటీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు ఆసుపత్రి ఆవరణ అంతా పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణంరాజు మాట్లాడుతూ రోగులకు సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారడం పట్ల ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️