ఎంతో ఆహ్లాదకరంగా ప్రజాశక్తి క్యాలెండర్‌

ఆవిష్కరించిన ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు
ప్రజాశక్తి – ఆచంట
ప్రజాశక్తి 2024 క్యాలెండర్‌ ఎంతో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా ఉందని ఆచంట నియోజకవర్గ ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ప్రజాశక్తి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాశక్తి దినపత్రిక ఈ నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్‌ స్థాయిలో అనేక యూట్యూబ్‌, టీవీ ఛానళ్లు, వివిధ రకాల కార్పొరేట్‌ దిన పత్రికలను తట్టుకుంటూ ప్రజాశక్తి దినపత్రిక ఎటువంటి లాభాపేక్ష లేకుండా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. ఇటువంటి పత్రికను అందరూ ప్రోత్స హించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆచంట మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌, పెనుమంచిలి సర్పంచి గణేశుల శేషవాణి సుబ్బారావు, వైసిపి నాయకురాలు మామిడిశెట్టి కృష్ణవేణి, మార్టేరు నెగ్గపూడి ఎంప ిటిసి సభ్యులు కర్రి అనురాధ, పెనుగొండ లక్ష్మి, ప్రజాశక్తి నరసాపురం డివిజన్‌ ఇన్‌ ఛార్జి కటకంశెట్టి బాలాజీనాయుడు, ఆచంట విలేకరి పి.మోహన్‌రావు పాల్గొన్నారు.

➡️