ఎఎస్‌ఎన్‌ఎం కళాశాలలో జాతీయస్థాయి సెమినార్‌

ప్రజాశక్తి – పాలకొల్లు
పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆక్వా కల్చర్‌పై జాతీయ స్థాయి సదస్సు మంగళవారం నిర్వ హించారు. రొయ్యలు, చేపల సాగులో పురోగతి, సవాళ్లు, అవకాశాలు అంశంపై సదస్సు నిర్వహించారు. సద స్సును ఏలూరు కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో వివిధ ఆక్వా ఉత్పత్తుల సంస్థలు సంయుక్తంగా కళాశాల జంతు శాస్త్ర విభాగం, ఆక్వా కల్చర్‌ విభాగం ఐక్యూఎసి ద్వారా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా డాక్టర్‌ ఎ.మట్టారెడ్డి, ప్రొఫెసర్‌ జి.సింహాచలం, ప్రొఫెసర్‌ సిహెచ్‌.మంజులత, కె.వెంకటేశ్వరరావు హాజరయ్యారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఆదికవి నన్నయ యూనివర్శిటి జువాలజీ డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ మట్టారెడ్డి, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ జువాలజీ, ఆక్వాకల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ జి.సింహాచలం, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ జువాలజీ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ సి.మంజులత పొల్యూషర్‌ ఏలూరు కంట్రోల్‌ బోర్డు డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ సదస్సుకు సుమారు 150 మంది వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌, విద్యార్థులు పాల్గొని తమ పరిశోధనా పత్రాలను అందించారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు జాతీయస్థాయిలో జరుగుతున్న ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు వక్తలు అన్నారు. ఈ కార్యక్రమానికి జువాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.రామకృష్ణ కన్వీనర్‌గా వ్యవహరించారు.

➡️