ఎన్నికలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ప్రజాశక్తి – పాలకొల్లు

ఎన్నికల నోటి ఫికేషన్‌ దగ్గర పడడంతో పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలోని అధికా రులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ కలెక్టర్‌ శివ నారాయణ రెడ్డి చెప్పారు. పాలకొల్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో ఎన్నికల సమయాత్తంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపిడిఒలు, పలు శాఖల ఇంజినీర్లు, మున్సిపల్‌ అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి అధికారీ ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగిఉండాలని కోరారు. ఈ సమావేశంలో పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలు, సివిల్‌ సప్లరు అధికారులు పాల్గొన్నారు.

➡️