ఎస్‌కెఎస్‌డి విద్యార్థినులకు అభినందన

ప్రజాశక్తి – తణుకు రూరల్‌
ఆదికవి నన్నయ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ (ఉమెన్‌) ఇంటర్‌ కాలేజీయెట్‌, యూ నివర్సిటీ సెలక్షన్స్‌లో ఎస్‌కెఎస్‌డి కళాశాల విద్యార్థినులు నాలుగో స్థానాని సాధించారని ప్రిన్సిపల్‌ కరుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాకినాడ ఐడిఎల్‌ కాలేజీలో ఎంపికలు జరిగాయి. అందులో ఎస్‌కెఎస్‌డి కళాశాల విద్యార్థినులు కె.స్వాతి, కె.జయశ్రీ, జి.అనూష, ఎం.భువన, సిహెచ్‌.మధులత, పి.రమ్య, పి.షారోన్‌, యుఎన్‌డి భవాని నాలుగో స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా వారిని కళాశాల కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎం.రత్నకుమారితో పాటు పలువురు అభినందించారు.

➡️