ఎస్మా ప్రయోగించినా బెదరం

27వ రోజు కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

జిఒ 2 ప్రతుల దహనం

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

సాగర మధనం జరిగేటప్పుడు ముందు విషం వచ్చింది తరువాత అమృతం వచ్చిందని, ఈ పోరాటంలో కూడా విషం లాంటి ఎస్మాను ప్రయోగించారు తరువాత సమస్యలు పరిష్కరించడం తప్పదని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ అన్నారు. ఆదివారం 27వ రోజు సమ్మె నేపథ్యంలో అంగన్‌వాడీలు ఎస్మా జిఒ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు గోపాలన్‌ మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటానికి భయపడి సంబంధం లేని చట్టాన్ని రుద్దుతూ నిర్బంధాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె ప్రభుత్వానికి దడ పుట్టిస్తోందన్నారు. సమ్మెకు ప్లాట్‌ రిక్షా వర్కర్స్‌ యూనియన్‌ కార్మికులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు డి.కళ్యాణి, తులసి, లక్ష్మి, సత్యవతి పాల్గొన్నారు.అంగన్వాడీల సమ్మెలో భాగంగా 24 గంటల రిలే నిరాహార దీక్షలను రెండో రోజు యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి జి.గోపీమూర్తి ప్రారంభించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె ప్రభుత్వ ఆగడాలను బట్టబయలు చేస్తోందన్నారు. యుటిఎఫ్‌ నాయకులు కనకదుర్గ మాట్లాడారు. దీక్షలో కె.తులసి, పి.నాగరత్నం, ఎ.లక్ష్మి, మణి, కనకమహాలక్ష్మి మాధవి, శాంతికుమారి, దుర్గ కూర్చున్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ రామరాజు, రామభద్రం, పట్టాభి రామయ్య, సీతారామరాజు, సిఐటియు నాయకులు జెఎన్‌వి. గోపాలన్‌, బి.వాసుదేవరావు, డి.కళ్యాణి ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు. పెంటపాడు : అంగన్వాడీల సమ్మె 27వ రోజుకు చేరింది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ 2 ఎస్మా కాపీలను ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, అంగన్వాడీ నాయకులు జై.శ్యామలాకుమారి, వి.కనకమహాలక్ష్మి మాట్లాడారు. వెంటనే జిఒను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.అనురాధ, జి.జయలక్ష్మి, సిహెచ్‌.శ్రీదేవి, హైమ, వెంకటలక్ష్మి, నాగమణి, శిరీష, మంగతాయారు పాల్గొన్నారు.యలమంచిలి : అంగన్వాడీలపై ప్రభుత్వం విధించిన ఎస్మా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చించినాడ జాతీయ రహదారిపై జిఒ 2 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవ సుధాకర్‌, ఎం.ఆంజనేయులు, టి.స్టాలిన్‌, పి.శ్రీనివాస్‌, జోషప్‌ రాజు, ఆనంద్‌రాజు, జున్ను పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగే అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలు 27వ రోజు కొనసాగాయి. ఈ దీక్షల్లో ఆయా సెక్టార్‌ నాయకులు సాయి మహాలక్ష్మి, మౌనిక, సరస్వతితో పాటు కార్యకర్తలు నేతల నాగమణి, రాణి సులోచన, లక్ష్మి కుమారి, సుజాత, విజయలక్ష్మి, ఆయాలు భాస్కరి, కుసుమకుమారి, నాగలక్ష్మి, అలివేలు, హైమావతి, రామలక్ష్మి కూర్చున్నారు. కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కూసంపూడి సుబ్బరాజు సంఘీభావం తెలిపారు.పోడూరు : జిఒ 2ను రద్దు చేయాలని అంగన్వాడీ మండల కార్యదర్శి జె.ఉమాదేవి డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద జిఒ కాపీని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు పి.రాజామణి, ఆర్‌.కుమారి, ఆర్‌.అనసూయ, ఎస్‌.భాగ్యలక్ష్మి, ఎ.భవాని, డి.భాగ్యలక్ష్మి, సిఐటియు నాయకులు పిల్లి.ప్రసాద్‌ పాల్గొన్నారు.ఆకివీడు : అంగన్వాడీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐద్వా మండల నాయకులు సందక ఉదయ కుమారి భరోసా ఇచ్చారు. అంగన్వాడీల సమ్మె 27వ రోజు కొనసాగింది. ఐద్వా సభ్యులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి సందక ఉదయ కుమారి మాట్లాడారు. అనంతరం ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా జిఒ కాపీలను దహనం చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు లావణ్య, కళ్యాణి, బత్తెన పార్వతి, కె.విజయ లావణ్య, కృష్ణవేణి, భవాని, సిఐటియు నాయకులు కె.తవిటినాయుడు, అంగన్వాడీల నాయకులు కృష్ణకుమారి, సీతామాలక్ష్మి పాల్గొన్నారు. పాలకొల్లు : 27 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఎస్మా జిఒ కాపీలను దహనం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్‌రారు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. ఎస్మా జిఒలకు అంగన్వాడీలు భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, పట్ణణాధ్యక్షులు పెచ్చెట్టి సత్యనారాయణ, పురుషోత్తం, అంగన్వాడీ నేతలు పాల్గొన్నారు.తణుకు రూరల్‌ : అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం జగన్‌ నియంతృత్వానికి నిదర్శనమని సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, జనసేన నాయకులు అనుకుల రమేష్‌, కాంగ్రెస్‌ పట్టణ కార్యదర్శి డి.రామకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి పివి.ప్రతాప్‌ విమర్శించారు. సమ్మెలో భాగంగా 27వ రోజు ఎస్మా చట్టం ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ గార రంగారావు, బి.వసంతకుమారి, ఎం.మణి మాలతి, వి.ప్రమీల, ఆర్‌.లీలా నాగవేణి, టి.సుభద్రాదేవి, ఆర్‌.కనకదుర్గ, మంగతాయారు, బి.వరలక్ష్మి, ఎల్‌.లలిత, పి.భువనేశ్వరి పాల్గొన్నారు.గణపవరం : అంగన్‌వాడీల సమ్మె 27 రోజు కొనసాగింది. అయితే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు జిఒ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మండల కమిటీ నాయకులు బి.రామకోటి మాట్లాడారు. హామీలు అమలు చేయాలని కోరితే తమపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం సమంజసం కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డి.సత్యవతి, చంద్రకళ, భవానీ, సత్యవాణి, సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. మొగల్తూరు : పౌష్టికాహారం అందించే అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్‌ రారు అన్నారు. 27వ రోజు దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. అనంతరం జిఒ ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆదూరి సాంబమూర్తి, అంగన్వాడీలు పెద్దింట్లు, సారమ్మ, సీత, నాగలక్ష్మి, రేఖ శాంభవి పాల్గొన్నారు.

➡️