కొవ్వొత్తులతో అంగన్‌వాడీల నిరసన

ప్రజాశక్తి – గణపవరం

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరింది. ఆదివారం అంగన్‌వాడీలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గణపవరం, సరిపల్లి, ప్రధాన రహదారుల్లో సాగింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ మండల కమిటీ నాయకులు బి.రామకోటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమ్మె చేస్తున్నా పట్టనట్లు వ్యవహరించడం వారిని కించపర్చడమేనని తెలిపారు. ప్రభుత్వం అంగన్‌వాడీలను తక్కువ చేసి చూస్తే రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు కెవి.మహాలక్ష్మి జె.జయలక్ష్మి, కళ్యాణి, ధనలక్ష్మి, సిహెచ్‌. మహాలక్ష్మి పాల్గొన్నారు.పోడూరు : అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరింది. ఆదివారం సాయంత్రం మండల వ్యాప్తంగా గ్రామాల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు ప్రాజెక్టు లీడర్‌ పీతల రాజమణి, జి.వనజ, కె.పద్మావతి, ఎస్‌.శ్రీపద్మావతి, కె.అరుణ, ఎం.అమ్మాజీ ర్యాలీలో పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. మండల పరిధిలోని సిఐటియు ఆధ్వర్యంలో నత్తారామేశ్వరం, మల్లిపూడి, సోమరాజు ఇల్లింద్రపర్రు, సత్యవరం, మార్టేరుతో పాటు పలుచోట్ల నిరసన తెలిపారు. కార్యక్రమంలో సాయి మహాలక్ష్మి, మౌనిక, సరస్వతితో పాటు పలు గ్రామాల్లో కార్యకర్తలు పాల్గొన్నారు.పెనుగొండ : అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నిరవదిక సమ్మెకు మద్దతుగా మండలంలో లబ్ధిదారులు ప్రదర్శన నిర్వహించారు. అలాగే పలు గ్రామాల్లో తల్లులు, పిల్లలు ఆదివారం సమ్మెకు మద్దతుగా నిలిచారు. అంగన్‌వాడీలు విధులకు హాజరైన తరువాతే తమ పిల్లలను కేంద్రాలకు పంపిస్తామని తల్లులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కానూరి తులసి, వివి.నాగలక్ష్మి, వి.హైమ, బి.ధనకుమారి, ఎన్‌.కృష్ణవేణి, పి.వెంకటలక్ష్మి, ఎం.మంగ పాల్గొన్నారు. ఉండి : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం అంగన్‌వాడీలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ తమను అణగదొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. డిమాండ్లు నెరవేర్చాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.ఆకివీడు : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీల చేపట్టిన సమ్మె 13వ రోజు కొనసాగింది. ఈ దీక్షలో భాగంగా ఆదివారం రాత్రి మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని పెదకాపవరంలో అంగన్వాడీ కార్యకర్త దుర్గాదేవి నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో అంగన్వాడీల లబ్ధిదారులు సైతం పాల్గొనడం విశేషం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను ఆపేదేలేదని అంగన్‌వాడీలు హెచ్చరించారు.భీమవరం రూరల్‌ : తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ పోరు కొనసాగిస్తామని కార్యకర్తలు ప్రభుత్వానికి హెచ్చరించారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఆదివారానికి 13వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. వారికి లబ్ధిదారుల నుండి పూర్తి మద్దతు లభించింది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల తాళాలను బలవంతంగా పగలగొట్టడంపై ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను ప్రభుత్వం నెరవేర్చాలని అంగన్వాడీలు కోరుతున్నారు.

➡️