గంగిరెద్దుకు ఎస్‌ఎస్‌ఎల వినతి

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌ రారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారు చేపట్టిన సమ్మె బుధవారానికి 22వ రోజుకు చేరింది. బుధవారం రాజా రామ్మోహన్‌ రారు సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఒక పక్క అంగన్వాడీలు, మరో పక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు, మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడం మాని ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. శ్రామికుల శ్రమను దోచుకునే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలూ కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. శిబిరం వద్ద ఉద్యోగ జెఎసి జిల్లా అధ్యక్షులు షేక్‌ బావాజీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం గంగిరెద్దుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసు సంతోషి, కె.శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️