గ్రామాలాభివృద్ధే జగన్‌ ధ్యేయం

ప్రజాశక్తి – గణపవరం

రాష్ట్రంలో గ్రామా లాభివృద్ధే ధ్యేయంగా జగన్‌ ప్రభుత్వం పని చేస్తోందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు) అన్నారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అర్థవరంలో రూ.47.6 లక్షలతో రహదారుల పనులను ప్రారంభించారు. రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సిసి రహదారి పనులను ప్రారంభించారు అప్పన్నపేటలో రూ.20 లక్షలతో సిసి రోడ్లు, మల్లపురాజుపేటలో రూ.47.60 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. కేశవరంలో ఫిష్‌ ఇన్‌ ఆంధ్ర అవుట్లెట్‌ ప్రారంభించిన అనంతరం ఎస్‌.కొండేపాడులో రూ.47.6 లక్షలతో నిర్మించిన సచివాల యాన్ని ప్రారంభించారు. మొయ్యేరులో రూ.20.లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రెయిన్‌ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్ధవరం గ్రామ సర్పంచి గాతల సుజాత అప్పన్నపేట సర్పంచి నూకారపు సుధాకర్‌ రావు, కేశవరం సర్పంచి మిడతని కామేశ్వరి, ఎస్‌.కొండేపాడు సర్పంచి శీతాళం వరలక్ష్మి, మెయ్యేరు సర్పంచి దూళ్ల కుటుంబరావు పాల్గొన్నారు.

➡️