చించినాడలో లెనిన్‌ భారీ ఫ్లెక్సీ ఆవిష్కరణ

ప్రజాశక్తి – యలమంచిలి
ప్రపంచ విప్లవ వీరుడు లెనిన్‌ శత వర్థంతిని పురస్కరించుకుని మండలంలోని చించినాడ గ్రామంలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో లెనిన్‌ నిలువెత్తు భారీ ఫ్లెక్సీని గురువారం స్థానిక సుందరయ్య పార్కు వద్ద ఆవిష్కరించారు. డివైఎఫ్‌ఐ జిల్లా మాజీ నాయకులు కానేటి బాలరాజు చేతుల మీదుగా ఈ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోవియట్‌ రష్యాలో ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు ప్రభుత్వాన్ని లెనిన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారన్నారు. అటువంటి మహనీయుని ఫ్లెక్సీని డివైఎఫ్‌ఐ సంఘం ఆధ్వర్యంలో చించినాడలో ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తెన్నేటి స్టాలిన్‌, మూరాల జైసింగ్‌, జిల్లేళ్లా శేఖర్‌, తెన్నేటి శివాజీ, పల్లేరు అనిల్‌, ఆకుమర్తి జోసెఫ్‌రాజు పాల్గొన్నారు.

➡️