జగనన్న సురక్షను వినియోగించుకోవాలి : కలెక్టర్‌

భీమవరం :జిల్లా వ్యాప్తంగా రెండో విడత చేపట్టనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని ఈనెల రెండు నుంచి ఆరు నెలల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి మండలంలో వారానికో క్యాంపు జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో మంగళ, శుక్రవారాల్లో, పట్టణ ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో జరుగుతుందని తెలిపారు. ఈ క్యాంపులో నలుగురు వైద్యుల బృందం ఉంటుందని, దీనిలో ఇద్దరు స్పెషలిస్ట్‌ వైద్యులు కూడా ఉంటారని తెలిపారు. వెల్నెస్‌ కేంద్రాల్లో జరిగే ఈ క్యాంపుల కోసం రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌, హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల్లో 187 రకాల మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్యాంపుల్లో 14 రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

➡️