జిల్లా స్థాయి పోటీల్లో అగ్రహారం జట్టు విజయం

Jan 31,2024 22:07

ప్రజాశక్తి – ఉండి
జిల్లా స్థాయి పోటీల్లో మండలంలోని ఎన్‌ఆర్‌పి అగ్రహారం మహిళా కబడ్డీ జట్టు మరో విజయాన్ని అందుకుంది. బుధవారం భీమవరంలో జరిగిన ఆడుదాం ఆంధ్రా జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఉండి నియోజకవర్గం నుంచి అగ్రహారం మహిళా కబడ్డీ జట్టు పాలకొల్లు నియోజకవర్గం మహిళా జట్టుపై ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌పి అగ్రహారం గ్రామ సర్పంచి సురవరపు కనకదుర్గ వెంకటాచార్యులు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన మహిళలు జిల్లా స్థాయిలో విజయం సాధించి తమ గ్రామం పేరును జిల్లాలో నిలపడం ఆనందదాయకమన్నారు. బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సూరవరపు వెంకటాచార్యులు మాట్లాడుతూ జిల్లా విజేతగా నిలిచే ఉండి నియోజకవర్గానికి చెందిన జట్లకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నగదు బహుమతికి రెండింతలు ఇస్తానని పివిఎల్‌ ప్రకటించడంతో క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయన్నారు. పివిఎల్‌.నరసింహరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులకు ఎంపిటిసి సభ్యులు మున్నలూరి సువర్ణలక్ష్మీశ్రీనివాస్‌, మాజీ సర్పంచి మునుకోలు సింహాచలం, గ్రామ పంచాయతీ కార్యదర్శి జడ్డు వెంకట తాత నాయుడు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముగ్గళ్ల సత్యనారాయణ అభినందనలు తెలిపారు.

➡️