దాళ్వాలో ప్రతి ఎకరాకూ నీరు

Dec 19,2023 19:02

పోడూరు మండల సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు పెద్దిరాజు
ప్రజాశక్తి – పోడూరు
రానున్న దాళ్వా పంటకు ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజు తీసుకున్నారని జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్‌ కా ర్యాలయంలో ఎం పిపి సబ్బితి సుమంగళి సాగర్‌ అధ్యక్షతన మం గళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు పాల్గొని తమ శాఖలపై జరుగుతున్న, జరగనున్న పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సిఎం జగన్‌ బడుగు, బలహీన, పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ వైద్యం ఖర్చును రూ.25 లక్షల వరకు పెంచడం అభినందనీయమన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా పంటను విక్రయించుకోవచ్చన్నారు. రానున్న దాల్వా పంటకు ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత శ్రీరంగనాథరాజు తీసుకున్నారన్నారు. అనంతరం ఎంపిడిఒ డి.సుహాసిని ఆధ్వర్యంలో జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు చేతుల మీదుగా క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేయించి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️