నిరుద్యోగ యువత కోసమే జాబ్‌మేళా

Feb 10,2024 21:58

కొవ్వలి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ రామ్మోహన్‌నాయుడు
ప్రజాశక్తి – నరసాపురం
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో కొవ్వలి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళాను నిర్వహించానని కొవ్వలి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కొవ్వలి యతిరాజ రామ్మోహన్‌నాయుడు అన్నారు. నరసాపురం తెలగా కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పందన లభించింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిమంది నిరుద్యోగులు ఈ జాబ్‌మేళాను వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఐడిబిఐ బ్యాంక్‌, అపోలో ఫార్మసీ, శ్రీరామ్‌ చిట్స్‌ తదితర 50 ప్రముఖ బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు సుమారు పది వేల మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అవసరమైన వారిని ఎంపిక చేసుకున్నారు. పెద్దఎత్తున నిరుద్యోగ యువత వచ్చారు. అందులో అధిక సంఖ్యలో యువతిలు ఉన్నారు. ఈ మెగా జాబ్‌ మేళాను కొవ్వలి రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో వైఎన్‌ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణరావు, నాయకులు పొత్తూరి రామరాజు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొప్పాడ రవీంద్రనాథ్‌ఠాగూర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జాబ్‌ మేళా కన్వీనర్‌గా సిహెచ్‌.కాశీ విశాలాక్షి వ్యవహరించారు.

➡️