నిర్లక్ష్యంగా ఉంటే కలెక్టర్‌కు రిపోర్టు చేస్తా

ఇన్‌ఛార్జి ఎంపిడిఒ విజయసారధి

ప్రజాశక్తి – వీరవాసరం

మండలంలో వేసవి తాగునీటి యాక్షన్‌ ప్లాన్‌ అమలులో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఇన్‌ఛార్జి ఎంపిడిఒ విజయసారధి అన్నారు. వేసవి తాగునీటి యాక్షన్‌ ప్లాన్‌ సమీక్షా సమావేశాన్ని బుధవారం ఆర్‌డబ్ల్యుఎస్‌, ఇరిగేషన్‌, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌, సచివాలయ కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాలన్నారు. వేసవి వస్తున్నా తాగునీటికి ఇబ్బందులు రాలేదని నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. తాగునీటి చెరువులను పూర్తిగా నింపుకోవాలన్నారు. ఒక నిర్ధిష్ట సమయంలో తాగునీరు సరఫరా చేస్తూ నీటి కొరత అధిగమించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి 15 రోజులకొకసారి ఒహెచ్‌ఆర్‌, సంపు, ఫిల్టర్‌బెడ్‌లు క్లీన్‌ చేయాలన్నారు. ఒహెచ్‌ఆర్‌ల వద్ద నీటి సరఫరా, క్లీనింగ్‌కు సంబంధించి రికార్డు నిర్వహించాలన్నారు.

➡️