న్యాయవాదుల నిరాహార దీక్షలు

ప్రజాశక్తి – పాలకొల్లు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా పాలకొల్లు కోర్టు వద్ద న్యాయవాదుల నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదిత ల్యాండ్‌ చట్టాన్ని ఉపసంహరణ చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరంలో ప్రెసిడెంట్‌ తలుపుల శ్రీనివాసరావు, సెక్రటరీ నాగరాజు, రామలింగేశ్వరావు, ఆంజనేయులు, మురళీధరరావు, కిషోర్‌, సుబ్రహ్మణ్యేశ్వరరావు, రాజ్‌కుమార్‌, నగేష్‌, రంగారావు, వెంకటేశ్వరరావు, సుబ్బారావు, ప్రసన్న కుమార్‌, చక్రవర్తి, సత్యనారాయణ మూర్తి, పూర్ణ, హరిగోపాల్‌ పాల్గొన్నారు.

➡️