పంట బోదెల్లో పూడిక తొలగింపు

ప్రజాశక్తి – ఆచంట
తుపాన్‌ ప్రభావం వల్ల పంటపొలాల్లో నిలిచిపోయిన మురుగు నీరును బయటకు పంపేందుకు యుద్ధ ప్రతిపాదకన పనులు ప్రారంభించినట్లు వల్లూరు, భీమలాపురం సర్పంచులు నేలపూడి బేబీరామ్మోహన్‌రావు, గుబ్బల మాధవరావు అన్నారు. ఆదివారం వల్లూరు, భీమలాపురం పంట బోదెల్లో పూడిక తొలగింపు పనులను యుద్ధ ప్రతిపాదన చేపట్టినట్లు వారు తెలిపారు. ఇటీవల కురిసన వర్షాలకు పంట బోదెలు పూడుకుపోయాయని, మురుగునీరు కిందకు వెళ్లే విధంగా పంట కాల్లల ప్రక్షాళన చేపట్టామని వివరించారు.

➡️