పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ

Mar 13,2024 22:50

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌
ప్రజాశక్తి – భీమవరం
రాబోయే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ శిక్షణలో పోలింగ్‌ నిర్వహణ, ఇవిఎంల వినియోగం, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటి అప్లికేషన్స్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ అంశాలపై శిక్షణ అందించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సివి.ప్రవీణ్‌ఆదిత్య, జిల్లా శిక్షణ నోడల్‌ అధికారి కెసిహెచ్‌.అప్పారావు, జిల్లా కలెక్టరేటు ఎఒ పి.పాపారావు, అసెంబ్లీ లెవెల్‌ మాస్టర్‌ ట్రైనర్స్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ సిహెచ్‌.దుర్గాప్రసాద్‌, డిప్యూటీ తహాశీల్దార్‌ ఎం.సన్యాసిరావు, టెక్నికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.ఇవిఎంల గొడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌ ఇవిఎంలను భద్రపర్చిన స్థానిక గొడౌన్‌ను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. ఇవిఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నియోజకవర్గానికి సంబంధించి సెక్టారు అధికారులకు, సిబ్బందికి ఇసిఐ నిబంధనల మేరకు ఓటింగు యంత్రాలపై శిక్షణ ఇచ్చే నిమిత్తం ఒక్కో నియోజకవర్గానికి 15 ఇవిఎంల చొప్పున ఆయా నియోజకవర్గాల తహాశీల్దార్లకు అందజేశారు. తొలుత పర్యవేక్షణ రిజిస్టర్‌లో కలెక్టర్‌ సంతకం చేశారు. గొడౌన్‌ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ గార్డులకు పలు సూచనలను కలెక్టర్‌ జారీ చేశారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ సివి.ప్రవీణ్‌ ఆదిత్య, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ బి.శివనారాయణరెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సూపరింటెండెంట్‌ సిహెచ్‌. దుర్గాప్రసాద్‌, డిప్యూటీ తహాశీల్దార్‌ ఎం.సన్యాసిరావు ఉన్నారు.సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకంజాయింట్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య సార్వత్రిక ఎన్నికల్లో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల ప్రవర్తనా నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సివి.ప్రవీణ్‌ ఆదిత్య అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో ఉండి నియోజకవర్గ సెక్టార్‌ అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహిం చారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల పట్ల బాధ్యతతో పని చేయాల న్నారు. సెక్టార్‌ అధికారులు తరచూ బూత్‌ లెవెల్‌ అధికారు లతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఒక్కో సెక్టార్‌ అధికారికి సుమారు 10 నుండి 12 పోలింగ్‌ స్టేషన్ల విధులను కేటాయించామన్నారు.

➡️