‘పది’ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం

ప్రజాశక్తి – నరసాపురం
పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని ఎంఇఒ పి.పుష్పరాజ్యం తెలిపారు. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు మండలంలోని పరీక్షా కేంద్రాల్లో 1894 మంది విద్యార్థులకు 1779 హాజరవ్వగా 115 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు.ఆచంట : మండలంలోని ఆచంట, కొడమంచిలి, వల్లూరు, ఆచంట వేమవరం జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు విద్యార్థులు తెలుగు పరీక్ష రాశారు. తెలుగు సబ్జెక్టు పరీక్షకు 573 మంది విద్యార్థులకు 532 హాజరవ్వగా 41 మంది గైర్హాజరైనట్లు ఎంఇఒ ఉషారాణి తెలిపారు. కాళ్ల : మండలంలోనాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోపల్లె పరీక్షా కేంద్రంలో 227 మంది విద్యార్థులకు 206 మంది హాజరవ్వగా 21 మంది గైర్హాజరయ్యారు. కాళ్ల పరీక్షా కేంద్రంలో 279 మందికి 263 మంది, ఏలూరుపాడు పరీక్షా కేంద్రంలో 192 మందికి 176 మంది, కలవపూడి పరీక్షా కేంద్రంలో 133 మంది విద్యార్థులకు 127 మంది హాజరయ్యాయరని ఎంఇఒ-2 గాదిరాజు కనకరాజు తెలిపారు. మండలంలో మొత్తం 831 మంది విద్యార్థులకు 772 మంది విద్యార్థులు హాజరవ్వగా 59 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు. తాడేపల్లిగూడెం : మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తాడేపల్లిగూడెం ఎంఇఒ పిఎంకె.జ్యోతి తెలిపారు. పట్టణం, మండలం కలిపి 13 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 2656 మంది విద్యార్థులకు 2467 మంది హాజరయ్యారని, 187 మంది గైర్హాజరయ్యాయరని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఉండి :ఉండి-ఎ, ఉండి-బి, ఎన్‌ఆర్‌పి అగ్రహారం, ఉప్పులూరు పరీక్షా కేంద్రాల్లో 658 మంది విద్యార్థులకు 594 మంది హాజరవ్వగా 64 మంది గైర్హాజరైనట్లు ఎంఇఒ బి.జ్యోతి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులు అస్వస్థతకు గురైతే చికిత్స అందించేందుకు ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది అందుబాటులోనే ఉన్నట్లు వారు తెలిపారు. పాలకొల్లు : పాలకొల్లులో మొత్తం 12 కేంద్రాల్లో 2137 మంది విద్యార్థులు పరీక్ష పరీక్షలు రాయనున్నారు. వీరిలో 1128 మంది బాలురు, 1009 మంది బాలికలు పరీక్ష రాశారు. పట్టణంలో బిఆర్‌ఎంబి హైస్కూల్‌, ఎంఎంకె హైస్కూల్‌, మున్సిపల్‌ గర్ల్స్‌ స్కూల్లో 300 చొప్పున విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు నామమాత్రంగానే ఉంది. ఇప్పటికే పోలీసులు ఎన్నికల బందోబస్తులో ఉన్నారు.గణపవరం : మండలంలో ఏడు హైస్కూళ్లకు సంబంధించిన 852 మంది విద్యార్థులకు 785 మంది హాజరవ్వగా 67 మంది గైర్హాజరయ్యారని ఎంఇఒ శేషు తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పెనుగొండ : మండలంలోని ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఇఒ సుధాకర్‌ తెలిపారు. సోమవారం నిర్వహించిన పరీక్షకు 1182 మంది విద్యార్థులకు 1015 మంది హాజరవ్వగా 167 మంది గైర్హజరయ్యారని తెలిపారు. పాలకోడేరు : మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 702 మంది విద్యార్థులకు 647 మంది హాజరవ్వగా 55 మంది గైర్హాజరయ్యారని ఎంఇఒ పివిఎస్‌.నాగరాజు తెలిపారు. పాలకోడేరులో 21 మంది, గొల్లలకోడేరులో పది మంది, శృంగవృక్షంలో ఏడుగురు, విస్సాకోడేరులో ఐదుగురు, మోగల్లులో 12 మంది చొప్పుప పరీక్షలకు గైర్హాజరయ్యారని తెలిపారు.

➡️