పనిముట్టు చేతబట్టగలం.. ప్రభుత్వాన్ని దించగలం

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులను రెచ్చగొట్టే విధంగా పోటీ కార్మికులు తీసుకురావడాన్ని సిఐటియు, ఎఐసిటియు నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా చేపట్టిన సమ్మె 10వ కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు మాట్లాడారు. ప్రభుత్వం అధికారుల ద్వారా సమ్మె విచ్ఛిన్నానానికి పాల్పడుతోందన్నారు. మున్సిపాల్టీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల పర్మినెంట్‌ చేయాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. సమ్మెలో జెఎసి నాయకులు జి.నాని, నేలపు రాజు, బంగారు వరలక్ష్మి, నేలపు విశ్వనాథం, నిమ్మకాయల ధనలక్ష్మి, బంగారు ఏసేబు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు, శ్రీను, సమ్మెకు సంఘీభావం తెలిపారు.తాడేపల్లిగూడెం : మున్సిపాల్టీలో పోటీ కార్మికులతో పనులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ అధికారులను కార్మికులు గురువారం నిలదీశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగింది. అయితే సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం మున్సిపల్‌ అధికారులు పోటీ కూలీలను తీసుకొచ్చి పనులు నిర్వహించడంతో వారిని సమ్మె చేస్తున్న కార్మికులు కలిసి సమ్మెకు దారి తీసిన పరిస్థితులను వివరించి మద్దతివ్వాలని కోరారు. దీంతో కొందరు కూలీలు వెనక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ఎ.శామ్యూల్‌ యూనియన్‌ నాయకులను చర్చలకు పిలిచారు. పట్టణంలో డెంగీ కేసులు ఉన్నాయని అందువల్ల పారిశుధ్య పనులకు ఆటంకం కలిగించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శిబిరం వద్ద ఎఐటియుసి ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు, మున్సిపల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు తాడికొండ కనకమహాలక్ష్మి, యూనియన్‌ కార్యనిర్వాహక అధ్యక్షురాలు మండేల్లి జయసుధ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుండా పోటీ కార్మికులతో పనులు చేయించడం సరికాదన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్‌, సిపిఎం జిల్లా సెక్రటేరియట్‌ సభ్యులు చింతకాయల బాబూరావు, సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, యూనియన్‌ కార్యదర్శి చంద్రరావు, కోశాధికారి కాటమరాజు, సహాయ కార్యదర్శి అల్లం నరేంద్ర కుమార్‌ పాల్గొన్నారు.కార్యక్రమానికి సిఐటియు నాయకులు కర్రి నాగేశ్వరరావు, తెనాలి రాజు, కె.సతీష్‌, దయామణి, భాను నాయకత్వం వహించారు. తణుకు రూరల్‌ :పనిముట్లు చేతబట్టగలం, ప్రభుత్వాన్ని పతనం చేయగలమని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె పదో రోజు కొనసాగింది. ఈ మేరకు కార్మికులు పనిముట్లు చేత పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడుతూ చాలీచాలని జీతంతో బతుకుతున్న మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచడంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నీలపు ఆదినారాయణ బాబు, గుర్రాల చిన్న, డి.వల్లీ, నీలాపు రవి, ముత్యాల శివప్రసాద్‌, పడాల దానం, పి.అయ్యప్ప, బంగారు పైడమ్మ పాల్గొన్నారు.పాలకొల్లు : రెండు రోజులుగా ఎఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధనకు దీక్ష చేస్తున్న పారిశుధ్య కార్మికులకు జనసేన పట్టణ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నియోజవర్గ సమన్వయ కర్త శిద్దిరెడ్డి అప్పారావు మాట్లాడారు. నేతలు తులా రామలింగేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు పినిశెట్టి శ్రీనివాస్‌, విన్నకోట గోపి పాల్గొన్నారు.

➡️