పాఠశాలకు ఐరన్‌ రాక్స్‌ పంపిణీ

ప్రజాశక్తి – పాలకొల్లు
పాలకొల్లులోని జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్‌ పాఠశాలలో యుకెసి అవార్డు కమిటీ చైర్‌పర్సన్‌ కామిశెట్టి అయ్యప్పనాయుడు సౌజన్యంతో లైబ్రరీ బుక్స్‌, వంట పాత్రలు పెట్టుకునేందుకు మూడు ఐరన్‌ రాక్స్‌ బుధవారం బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఇఒ-2 ఆర్‌ఎన్‌విఎస్‌జి.శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు దాతల సహకారం అవసరమని చెప్పారు. పాఠ శాలలు ఆధునిక దేవాలయాలని, ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాయ పూడి భవానీప్రసాద్‌, ఎంటిఎస్‌ టీచర్‌ కాలగ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️