పాఠశాలకు తాగునీటి ట్యాంకు వితరణ

ప్రజాశక్తి – ఆకివీడు
మండలంలోని కోళ్లపర్రు గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు దాతలు మంచినీటి ట్యాంకు అందించారు. గ్రామ ప్రముఖులు, ఆకివీడు లయన్స్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షులు తోట భుజంగరావు ఆయన కుమారుడు వెంకటాచలంలు ఈ ట్యాంకును ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల లీటర్ల సామర్థ్యం గల ఈ ట్యాంకర్‌ సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందన ప్రభాకరరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, మోహన వెంకట శివ సాయి పాల్గొన్నారు.

➡️