పారిశుధ్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

Dec 1,2023 21:08

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌
పారిశుధ్య సిబ్బంది అంకితభావంతో పని చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణజయరాజు అన్నారు. పారిశుధ్య సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాట్లాడారు. తడి, పొడి చెత్త, ప్రమాదకర చెత్త వేర్వేరుగా సేకరించే అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎనిమిదో వారు కౌన్సిలర్‌ జయరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️