పిల్లల్లో సంస్కృతీ సంప్రదాయాలు పెంపొందించాలి

ప్రజాశక్తి – కాళ్ల
పిల్లల్లో విద్యా ర్థి దశ నుంచి సంస్కృతి, సంప్రదాయాలు పెం పొందించాల్సిన అవసరం ఉందని ఐఐటి బొంబాయి ప్రొఫెసర్‌ డాక్టర్‌ విఎస్‌ఎన్‌.రాజు అన్నారు. వేంపాడు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల(హెచ్‌)ను గ్రామ ప్రముఖులు బుధవారం సందర్శించారు. పిల్లల డాక్టర్‌ రామకృష్ణంరాజు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు వివరించారు. రిటైర్డ్‌ జెడిఎ పల్లంరాజు, ఎంఇఒ-2 జి.కనకరాజు, ప్రధానోపాధ్యాయులు బి.నాగమురళీశ్రీనివాసరావు మాట్లాడారు. ఉపాధ్యాయిని పివి.వరలక్ష్మి ప్రాథమిక స్థాయిలో టిఎల్‌ఎం ద్వారా బోధన చేయడంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని రకరకాల టిఎల్‌ఎం ప్రదర్శించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్యనారాయణరాజు, రామరాజు, వేణురాజు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు బంగార్రాజు, జ్యోతి, మమత పాల్గొన్నారు.

➡️