ప్రజారోగ్యానికి పెద్దపీట : ఎంపిపి

Jan 9,2024 20:55

పాలకోడేరు : ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో వైసిపి ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పేట వేస్తోందని పాలకోడేరు ఎంపీపీ భూపతి రాజు సత్యనారాయణ రాజు (చంటి రాజు) అన్నారు. పెన్నాడ అగ్రహారంలో సర్పంచి చిల్లా అనూష సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమాన్ని మంగళవారం ఎంపిపి ప్రారంభించి మాట్లాడారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఛాంబర్‌ మండల ప్రధాన కార్యదర్శి బొల్లా శ్రీనివాస్‌, ఉప ఎంపిపి ఆదాడ లక్ష్మీ తులసి, ఎంపిటిసి గాంధీ, తహశీల్దార్‌ పాల్గొన్నారు.

➡️